కేంద్ర మంత్రిమండలి భేటీ నేడు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఆదివారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషను వెలువడనున్న నేపథ్యంలో రెండోవిడత మోదీ సర్కారుకు ఇది తుది మంత్రిమండలి భేటీగా చెప్పవచ్చు.

Published : 03 Mar 2024 03:26 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఆదివారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషను వెలువడనున్న నేపథ్యంలో రెండోవిడత మోదీ సర్కారుకు ఇది తుది మంత్రిమండలి భేటీగా చెప్పవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షిస్తున్న ఈసీ త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించే అవకాశముంది. మూడోసారి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న మోదీ బృందం ఓ గెట్‌ టుగెదర్‌లా నిర్వహిస్తున్న ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకొంది. చాణక్యపురి డిప్లొమాటిక్‌ ఎన్‌క్లేవ్‌లోని సుష్మా స్వరాజ్‌ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. భాజపా సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గత అయిదేళ్లలో సాధించిన విజయాలపై ప్రధానంగా చర్చిస్తారు. 2014లో తొమ్మిది విడతల సాధారణ ఎన్నికల షెడ్యూలును ఈసీ మార్చి 5న ప్రకటించగా, మే 16న ఫలితాలు వెలువడ్డాయి. 2019లో మార్చి 10న ఏడు విడతల ఎన్నికల షెడ్యూలును ప్రకటించి, మే 23న ఫలితాలను వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని