సీఏఏ అమలుకు సంకేతమా ఇది!

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) త్వరలో అమలు చేయబోతోందనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated : 03 Mar 2024 09:08 IST

వైరల్‌గా అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ కార్ల నంబర్‌ప్లేట్లు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) త్వరలో అమలు చేయబోతోందనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వైరల్‌గా మారిన కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ కార్ల నంబర్‌ప్లేట్లు ఈ అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన ఈ ఇద్దరు మంత్రుల కార్ల నంబరుప్లేట్లపై అంకెల మధ్యలో ‘సీఏఏ’ అని ఉండటంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని సత్వరం అమలుచేయనున్నట్లు సంకేతాలు ఇస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019లోనే రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందే అమలులోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తూ సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సీఏఏ అమలుచేస్తాం. ఇది ఎవరి పౌరసత్వాన్ని లాక్కోడానికి కాదు’’ అని అమిత్‌ షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని