మరోసారి తండ్రైన పంజాబ్‌ సీఎం మాన్‌

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్‌ప్రీత్‌ కౌర్‌ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.

Published : 29 Mar 2024 04:43 IST

ఆడబిడ్డకు జన్మనిచ్చిన సతీమణి

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్‌ప్రీత్‌ కౌర్‌ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను మాన్‌ ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ‘‘దేవుడు నాకు ఆడబిడ్డను కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు’’ అని మాన్‌ పేర్కొన్నారు. దీంతోపాటు తన కుమార్తె ఫొటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మాన్‌కు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రౌస్‌ అవెన్యూ కోర్టు వెలుపల ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. మాన్‌ 2015లో తన తొలి భార్యతో విడిపోయారు. అనంతరం 2022లో గుర్‌ప్రీత్‌ను రెండో వివాహం చేసుకున్నారు. తొలి వివాహం ద్వారా ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని