‘సీ-విజిల్‌’ ద్వారా 79 వేల ఫిర్యాదులు నమోదు

ప్రజలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలను తెలియజేయడానికి ఎన్నికల సంఘం(ఈసీ) ప్రవేశపెట్టిన ‘సీ-విజిల్‌’ యాప్‌ సమర్థంగా పనిచేస్తోందని, ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించినప్పటి నుంచి దీని ద్వారా 79 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని ఈసీ శుక్రవారం తెలిపింది.

Published : 30 Mar 2024 05:40 IST

దిల్లీ: ప్రజలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలను తెలియజేయడానికి ఎన్నికల సంఘం(ఈసీ) ప్రవేశపెట్టిన ‘సీ-విజిల్‌’ యాప్‌ సమర్థంగా పనిచేస్తోందని, ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించినప్పటి నుంచి దీని ద్వారా 79 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని ఈసీ శుక్రవారం తెలిపింది. ఈ కేసుల్లో 99 శాతం మేర ఫిర్యాదులు పరిష్కరించామని, 89 శాతం కేసులను 100 నిమిషాల్లోనే చేధించామని పేర్కొంది. నమోదైన కేసుల్లో 73 శాతం అక్రమ బ్యానర్లు, హోర్డింగ్‌లపై.. 1400 ఫిర్యాదులు మద్యం, బహుమతులు, డబ్బుకు సంబంధించినవని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని