కళాశాల విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు రావడం కలకలం రేపింది. గ్వాలియర్‌లో నివాసముంటున్న ప్రమోద్‌ కుమార్‌ దండోటియా అనే విద్యార్థి స్థానిక కళాశాలలో చదువుకుంటున్నాడు.

Published : 31 Mar 2024 03:24 IST

గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు రావడం కలకలం రేపింది. గ్వాలియర్‌లో నివాసముంటున్న ప్రమోద్‌ కుమార్‌ దండోటియా అనే విద్యార్థి స్థానిక కళాశాలలో చదువుకుంటున్నాడు. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఈ మొత్తానికి ఐటీ, జీఎస్టీ చెల్లించాలని ఇటీవల ప్రమోద్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో కంగుతిన్న అతడు సంబంధిత అధికారులను సంప్రదించగా.. తన పాన్‌ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు తెలిసింది. ఆ కంపెనీ 2021 నుంచి ముంబయి, దిల్లీ వేదికగా కార్యకలాపాలు సాగించిందని వెల్లడైంది. దీంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ గురించి తనకు తెలియదని పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఆ విద్యార్థి పాన్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాతే అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని