విమాన ప్రయాణికులకు శుభవార్త

విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెరుగుతున్న కొద్దీ రద్దీ హెచ్చి, విమానాలు బయలుదేరడం ఆలస్యమైపోతోంది.

Published : 02 Apr 2024 04:13 IST

దిల్లీ: విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెరుగుతున్న కొద్దీ రద్దీ హెచ్చి, విమానాలు బయలుదేరడం ఆలస్యమైపోతోంది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాల్లోనే కూర్చోవలసి వస్తోంది. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులు విమానాశ్రయ నిష్క్రమణ ద్వారం నుంచి బయటకు వెళ్లిపోవడానికి పౌర విమానయాన భద్రతా సంస్థ (బీసీఏఎస్‌) కొత్త మార్గదర్శక నియమాలు అనుమతిస్తున్నాయి. మార్చి 30న జారీ చేసిన ఈ నియమావళి వెంటనే అమలులోకి వచ్చిందని బీసీఏఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ జుల్ఫికర్‌ హసన్‌ సోమవారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని