ముయిజ్జుకు మోదీ రంజాన్‌ శుభాకాంక్షలు

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 11 Apr 2024 04:19 IST

మాలె: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, నాగరికతపరమైన అనుసంధానం గురించి ప్రస్తావించారు. ‘‘సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నిర్వహించుకుంటున్న తరుణమిది. సోదరభావం, కరుణ, కలిసికట్టుగా ఉండడం వంటివాటి విలువను ప్రపంచ ప్రజలకు మనం గుర్తుచేస్తున్నాం. మనమంతా తపిస్తున్న శాంతియుత, సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడంలో ఇవన్నీ తప్పనిసరి’’ అని మోదీ పేర్కొన్నారు. ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు ఒడుదొడుకులకు లోనైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని