ఐఐఎం-అహ్మదాబాద్‌కు ప్రపంచంలో 25వ ర్యాంకు

వ్యాపార, నిర్వహణ (బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) విద్యను అందించే విద్యాసంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఐఐఎం-అహ్మదాబాద్‌ 25వ స్థానంలో నిలిచింది.

Published : 11 Apr 2024 04:19 IST

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల విడుదల

దిల్లీ: వ్యాపార, నిర్వహణ (బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) విద్యను అందించే విద్యాసంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఐఐఎం-అహ్మదాబాద్‌ 25వ స్థానంలో నిలిచింది. ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-కలకత్తా టాప్‌-50 జాబితాలో చోటు సంపాదించాయి. ఈ మేరకు 2024 సంవత్సరానికి గాను బుధవారం విడుదలైన లండన్‌కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణల సంస్థ క్వాక్‌వారెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల జాబితా వెల్లడించింది. ఆ ప్రకారం డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అంతర్జాతీయంగా 20వ ర్యాంకుతో మనదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. దంతవైద్య విద్యలో చెన్నైకు చెందిన సవితా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్‌ 24 స్థానాన్ని పొందింది. ఆర్ట్స్‌, ఆంగ్లభాష, భౌతిక శాస్త్రం, సాహిత్యం సహా ఏడు సబ్జెక్టుల్లో ఉత్తమంగా నిలిచిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 101-120 పాయింట్ల విభాగంలో ర్యాంకు దక్కించుకుంది. మొత్తం మనదేశానికి చెందిన 69 విద్యాసంస్థలు క్యూఎస్‌ ర్యాంకుల్లో స్థానం సంపాదించాయి. గతేడాది వాటి సంఖ్య 66.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని