మణిపుర్‌లో ఇరువర్గాల కాల్పులు.. ఇద్దరి మృతి

మణిపుర్‌లోని ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో శనివారం సాయుధులైన రెండు వర్గాల నడుమ జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

Published : 14 Apr 2024 05:05 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లోని ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో శనివారం సాయుధులైన రెండు వర్గాల నడుమ జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను ఇంకా గుర్తించలేదు. కాంగ్‌పోక్‌పీ జిల్లాకు సరిహద్దులో ఈ కాల్పులు జరిగాయి. పరిస్థితుల నియంత్రణకు అదనపు కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించారు. తెంగ్‌నౌపాల్‌ జిల్లాలో రెండు రోజుల కిందటే సాయుధులైన గ్రామ వాలంటీర్లకు, గుర్తుతెలియని వ్యక్తులకు నడుమ జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని