అయోధ్య రామాలయానికి 1,11,111 కిలోల లడ్డూ ప్రసాదం

ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల కోసం 1,11,111 కిలోల లడ్డూ ప్రసాదాన్ని పంపనున్నట్లు దేవ్‌రహా బాబా ట్రస్టుకు చెందిన ట్రస్టీ అతుల్‌ కుమార్‌ సక్సేనా ఆదివారం తెలిపారు.

Published : 15 Apr 2024 03:33 IST

సమర్పించనున్న దేవ్‌రహా బాబా ట్రస్టు

మీర్జాపుర్‌: ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల కోసం 1,11,111 కిలోల లడ్డూ ప్రసాదాన్ని పంపనున్నట్లు దేవ్‌రహా బాబా ట్రస్టుకు చెందిన ట్రస్టీ అతుల్‌ కుమార్‌ సక్సేనా ఆదివారం తెలిపారు. కాశీ విశ్వనాథ్‌, తిరుపతి శ్రీవారి ఆలయంతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలకూ ట్రస్టు తరఫున ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామాలయానికి 40 వేల కిలోల లడ్డును పంపినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని