ప్రొఫెసర్‌ శోమా సేన్‌ జైలు నుంచి విడుదల

ఎల్గార్‌ పరిషద్‌-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్‌ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ శోమా సేన్‌ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు.

Published : 18 Apr 2024 05:22 IST

ముంబయి: ఎల్గార్‌ పరిషద్‌-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్‌ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ శోమా సేన్‌ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు.  సామాజిక ఉద్యమకారిణి అయిన ఆమె ఎల్గార్‌ పరిషద్‌ కేసులో నిందితురాలుగా 2018, జూన్‌ 6వ తేదీ నుంచి జైలులో ఉన్నారు. ఆమెకు ఈ నెల 5న సుప్రీంకోర్టు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. నిబంధనలన్నీ పూర్తి చేసిన తర్వాత ముంబయిలోని బైకుల్లా జైలు నుంచి బుధవారం బయటకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని