రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి

తిహాడ్‌ జైలులో తాను ఇన్సులిన్‌ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్‌ అభ్యర్థనను దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 05:58 IST

 కోర్టుకు కేజ్రీవాల్‌ అభ్యర్థన

దిల్లీ: తిహాడ్‌ జైలులో తాను ఇన్సులిన్‌ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్‌ అభ్యర్థనను దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ గత 22 ఏళ్ల నుంచి మధుమేహంతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. అప్పటినుంచి వైద్యుడి సలహాతో ఇన్సులిన్‌ను తీసుకుంటున్నారని.. అరెస్టు తర్వాత ఇది ఆగిపోయిందని చెప్పారు. తన వైద్యుడు ప్రతిరోజు 15నిమిషాల పాటు ఇన్సులిన్‌ ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్‌ అభ్యర్థనపై తీర్పును సోమవారానికి రిజర్వు చేసిన ధర్మాసనం.. అవసరమైతే శనివారంలోగా దీనిపై స్పందించాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది. మరోవైపు కేజ్రీవాల్‌ను చంపేందుకు భారీ కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ అంశంపై ఆప్‌ నేతలు త్వరలోనే రాష్ట్రపతిని, ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని