సీఆర్‌పీఎఫ్‌ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా రాయ్‌కోట్‌ వద్ద 32 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది.

Published : 22 Apr 2024 05:49 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా రాయ్‌కోట్‌ వద్ద 32 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. దంతెవాడ జిల్లా పర్సాపాల్‌లో ఈ నెల 19న జరిగిన తొలి విడత లోక్‌సభ ఎన్నికల విధుల్లో వీరు పాల్గొన్నారు. ఆదివారం బస్సులో జగదల్‌పూర్‌ బయలుదేరారు. రాయ్‌కోట్‌ వద్ద పశువులు అడ్డు రావడంతో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను వెంటనే టోకాపాల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. వీరిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం డిమ్రాపాల్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని