మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి

దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది.

Published : 23 Apr 2024 06:48 IST

దిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. ఒడిశాలో ఈ నెల 15 నుంచి, పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరీవాహక ప్రాంతంలో 17 నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

  • బెంగాల్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌లో తీవ్ర ఉష్ణ పరిస్థితులు ఉండొచ్చు.!
  • గాల్లో తేమ ఎక్కువగా ఉండటంవల్ల ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతంలో, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్‌ బిహార్‌లో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావొచ్చు.  
  • తూర్పు మధ్యప్రదేశ్‌లో రాత్రివేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. దీన్ని ప్రమాదకర పరిణామంగా భావిస్తారు. ఎందుకంటే.. రాత్రివేళ కూడా వేడి కొనసాగితే శరీరం చల్లబడటానికి అవకాశం దొరకదు. ‘ఆర్బన్‌ హీట్‌ ఐలాండ్‌’ ప్రభావం వల్ల నగరాల్లో ఈ పోకడ ఎక్కువవుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని