‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’

దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 23 Apr 2024 04:56 IST

దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలు కనీసం ఆ చట్టం నిబంధనలను రూపొందించడంలోనూ విఫలమయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం తెలిపింది. చట్టం వచ్చిన ఆరు నెలల్లోగా నిబంధనలు రూపొందించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ అతీగతీ లేదంటూ పెదవి విరిచింది. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో రాష్ట్ర కమిషనర్లను  నియమించలేదని పేర్కొంది. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మిజోరం, పశ్చిమబెంగాల్‌, దిల్లీ, జమ్మూకశ్మీర్‌లలో నిధుల కేటాయింపు జరగలేదని వెల్లడించింది. దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని