ఈవీఎం, వీవీప్యాట్‌ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..

ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) స్పష్టం చేశాయి.

Published : 25 Apr 2024 04:56 IST

ఈసీఐఎల్‌, బెల్‌ల స్పష్టీకరణ

దిల్లీ: ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆ వివరాలను తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన వెంకటేశ్‌ నాయక్‌ అనే కార్యకర్త అభ్యర్థనలను తిరస్కరించాయి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8(1)డి.. వాణిజ్య విశ్వాసం, గోప్యత, మేధో సంపత్తితో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా మినహాయింపునిస్తుందని, దీని ప్రకారం ఈ సమాచారాన్ని తెలియజేయడానికి నిరాకరిస్తున్నట్లు సదరు కంపెనీలు తెలిపాయి. అయితే దేశంలో కోట్లాది మంది ఓటర్లకు ఓటింగ్‌ యంత్రాల గురించి తెలుసుకునే హక్కు ఉందని, ప్రధాన తయారీదారులు (ఈసీఐఎల్‌, బెల్‌) బయటి కంపెనీల ప్రమేయం లేకుండా ఈ భాగాలను తయారుచేస్తున్నాయని హామీ ఇస్తే సమంజసంగా ఉంటుందని నాయక్‌ అన్నారు. ఈవీఎంలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఓటర్లు తెలుసుకోవాలని భావిస్తున్నారని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని