సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో

వందేభారత్‌ సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Published : 28 Apr 2024 05:08 IST

దిల్లీ: వందేభారత్‌ సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీటి ప్రయోగాత్మక పరుగును జులైలోనే పరీక్షించనున్నారు. ఆ వెంటనే సాధ్యమైనంత త్వరగా వీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తారు. వాటంతట అవే మూసుకునే తలుపులు సహా- నగర ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని వీటిలో సరికొత్త సదుపాయాలు కల్పిస్తున్నారు. వీటిలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఒక రైల్లో కనీసం 12 బోగీలు చొప్పున ఉండేలా చూస్తారు. ఆయా మార్గాల్లో రద్దీ ఆధారంగా వీటిని 16కి పెంచుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని