ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు మరోసారి ఈడీ సమన్లు

ఆప్‌ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్‌ బోర్డుకు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది.

Published : 28 Apr 2024 05:09 IST

దిల్లీ: ఆప్‌ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్‌ బోర్డుకు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను కోరుతూ ఈ నెల 18న అమానతుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం ఖాన్‌ను దర్యాప్తుకు సహకరించాలని కోరింది. దీంతో గతవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయన్ను 13గంటలపాటు విచారించింది. తాజాగా ఈ విచారణను కొనసాగించేందుకు మరోసారి సహకరించాలని కోరింది. మరోవైపు ఇదే కేసులో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దివ్య మల్హోత్రా శనివారం అమానతుల్లా ఖాన్‌కు రూ.15 వేల బాండ్‌, ఒకరి పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని