వైవాహిక అత్యాచారాలకు మినహాయింపుపై పిటిషన్‌

వైవాహిక అత్యాచారాలను నూతన క్రిమినల్‌ చట్టాల (భారత న్యాయ సంహిత) నుంచి మినహాయించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Published : 18 May 2024 04:56 IST

కేంద్రం వైఖరి కోరిన సుప్రీంకోర్టు 

దిల్లీ: వైవాహిక అత్యాచారాలను నూతన క్రిమినల్‌ చట్టాల (భారత న్యాయ సంహిత) నుంచి మినహాయించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ‘‘ఇది రాజ్యాంగపరమైన అంశం. కొత్త చట్టాలు వచ్చాక కూడా ఇది సజీవంగానే ఉంటుంది’’ అని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఈ పిటిషన్‌ను వేసింది. భార్య మైనర్‌ కాకుంటే.. ఆమెతో భర్త బలవంతంగా శృంగారం చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించకూడదని భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని కొన్ని నిబంధనలు చెబుతున్నాయి. వాటిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత ఏడాది జనవరిలో కేంద్రం స్పందనను సుప్రీంకోర్టు కోరింది. భారతీయ న్యాయ సంహితలోనూ వైవాహిక అత్యాచారాల విషయంలో ఇదే తరహా మినహాయింపులు ఉండటంతో తాజా పిటిషన్‌ దాఖలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని