రహస్య ఓటింగ్‌కు విఘాతమంటూ పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ప్రస్తుత ఎన్నికల విధానంలో రహస్య ఓటింగ్‌ అనే ప్రక్రియకు విఘాతం కలుగుతోందని, ఆ నిబంధన ఉల్లంఘనకు గురవుతోందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Published : 18 May 2024 05:14 IST

దిల్లీ: ప్రస్తుత ఎన్నికల విధానంలో రహస్య ఓటింగ్‌ అనే ప్రక్రియకు విఘాతం కలుగుతోందని, ఆ నిబంధన ఉల్లంఘనకు గురవుతోందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం శుక్రవారం తేల్చిచెప్పింది. ఈవీయంలలో అక్రమాలు జరుగుతున్నాయన్న పిటిషనర్‌ ఆరోపణలను తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు