సంక్షిప్త వార్తలు (3)

ఉసేన్‌ బోల్ట్‌ మూడు ఒలింపిక్స్‌ పోటీల్లో 8 బంగారు పతకాలను గెల్చుకున్నాడు. అతడు ట్రాక్‌ మీద పరిగెత్తింది 115 సెకన్ల కంటే తక్కువ సమయమే. కానీ గెల్చుకున్నది 11.9 కోట్ల డాలర్లు! అయితే ఇదంతా రాత్రికిరాత్రే అతడికి దక్కలేదు. 

Updated : 23 May 2024 05:39 IST

బంగారు భవితకు దీర్ఘకాలిక వ్యూహం

ఉసేన్‌ బోల్ట్‌ మూడు ఒలింపిక్స్‌ పోటీల్లో 8 బంగారు పతకాలను గెల్చుకున్నాడు. అతడు ట్రాక్‌ మీద పరిగెత్తింది 115 సెకన్ల కంటే తక్కువ సమయమే. కానీ గెల్చుకున్నది 11.9 కోట్ల డాలర్లు! అయితే ఇదంతా రాత్రికిరాత్రే అతడికి దక్కలేదు. 

ఆ రెండు నిమిషాల పరుగు కోసం అతడు 20 ఏళ్లు సాధన చేశాడు. అది తన పెట్టుబడి. దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలపైనే దృష్టిపెట్టి కృషి చేయాలన్నది బోల్ట్‌ జీవితం నేర్పే పాఠం.

వాలా అఫ్సర్, కాలమిస్ట్‌  


కోర్సుల ఎంపిక పిల్లల చేతిలో ఉండాలి

పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తమ పిల్లలను ఏ కోర్సులో చేరిస్తే బాగుంటుందో చెప్పండంటూ దాదాపు 95 శాతం మంది తల్లిదండ్రులు ఇతరులను అడుగుతుంటారు. కెరీర్‌ ఎంపికకు ఇది సరైన పద్ధతి కాదు. ఈ కారణంగానే విద్యార్థులు తమకు ఏ మాత్రం ఆసక్తి లేని రంగాన్ని ఎంచుకున్నందుకు పశ్చాత్తాపపడుతుంటారు. ముందు తమ పిల్లలకు ఏ రంగాల్లో ఆసక్తి ఉందో తల్లిదండ్రులు కనుక్కోవాలి. దాని ఆధారంగానే కోర్సును ఎంపిక చేసుకోవాలి.

అరుణ్‌ భాగవతుల, మానవ వనరుల నిపుణులు 


రెండు దేశాలు.. ఒక రాజధాని..  ఇదే పరిష్కారం!

గాజాలో యుద్ధం ఒక రాచపుండు.. ఇది ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందే ముప్పుంది. ఇక్కడ శాంతి, సుస్థిరత నెలకొనాలంటే.. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ సర్వస్వతంత్ర దేశాలుగా ఉండే ద్విదేశ పరిష్కారమే ఏకైక మార్గం. వాటికి జెరూసలెం ఉమ్మడి రాజధానిగా ఉండాలి. 

ఆంటోనియో గుటెరస్, ఐరాస సెక్రటరీ జనరల్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని