ప్రజ్వల్‌.. వెంటనే లొంగిపో

అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడు, హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న వెంటనే పోలీసులకు లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ హెచ్చరించారు. తన సహనానికి పరీక్ష పెట్టవద్దన్నారు.

Published : 24 May 2024 04:03 IST

మాజీ ప్రధాని దేవేగౌడ హెచ్చరిక 

ఈనాడు, బెంగళూరు: అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడు, హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న వెంటనే పోలీసులకు లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ హెచ్చరించారు. తన సహనానికి పరీక్ష పెట్టవద్దన్నారు. ‘కొన్ని వారాలుగా నా గురించి, నా కుటుంబం గురించి పలువురు అత్యంత హీనంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడేవారిని నియంత్రించే ప్రయత్నం చేయను. ప్రజ్వల్‌ చేసిన పనులు, అతడి విదేశీ ప్రయాణ వ్యవహారం తెలియదంటూ ప్రజలను నమ్మించటం సాధ్యం కాదు. నా ఆత్మసాక్షికి, దేవుడికి మాత్రమే సత్యం తెలుసని నమ్మగలను. ఇంతకాలం ప్రజ్వల్‌ కారణంగా ఎంతో బాధ అనుభవించిన నా కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు ఇంత సమయం పట్టింది. ఇప్పుడు చెబుతున్నా ప్రజ్వల్‌.. ఇక సహనాన్ని పరీక్షించకుండా పోలీసులకు లొంగిపో. చట్టప్రకారం నీవు దోషి అని తేలితే శిక్ష అనుభవించు. నేను పోలీసుల విచారణకు అడ్డుతగలను. అతను నిజంగా తప్పు చేసి ఉంటే బాధితులకు న్యాయం దక్కేలా చేయటమే నా లక్ష్యం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని