ఇద్దరిని బలిగొన్న బాలుడు అబ్జర్వేషన్‌ హోమ్‌కు

మహారాష్ట్రలోని పుణె కారు ప్రమాద ఘటనలో నిందితుడైన బాలుడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశాల మేరకు అబ్జర్వేషన్‌ హోంకు తరలించినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.

Published : 24 May 2024 04:51 IST

పుణె: మహారాష్ట్రలోని పుణె కారు ప్రమాద ఘటనలో నిందితుడైన బాలుడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశాల మేరకు అబ్జర్వేషన్‌ హోంకు తరలించినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. పోలీసుల రివ్యూ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగిన ప్రాంగణంలో ఉన్న అబ్జర్వేషన్‌ హోంలో బాలుడిని ఉంచామని, ప్రస్తుతం అక్కడ 30 మంది మైనర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. బాలుడి బెయిల్‌పై విమర్శలు రావడంతో పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డును ఆశ్రయించి, ఆదేశాలను పునఃపరిశీంచాలని కోరారు. దాంతో బెయిల్‌ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చేనెల 5 వరకు అబ్జర్వేషన్‌ హోంలో ఉంచాలని ఆదేశించింది. బాలుడి మానసిక స్థితికి అండగా ఉండేందుకు, తిరిగి అతడిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలని బోర్డు ఆదేశించినట్లు నిందితుడి తరఫు న్యాయవాది ప్రశాంత్‌ పాటిల్‌ తెలిపారు. మరోవైపు ఈ కేసులో భాగంగా పోలీసులు బాలుడి తాతయ్యను గురువారం ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని