నటి లైలాఖాన్‌ హత్యకేసు.. సవతి తండ్రికి మరణశిక్ష

ఒకప్పటి బాలీవుడ్‌ నటి లైలా ఖాన్, ఆమె కుటుంబం 2011లో దారుణ హత్యకు గురైన కేసులో ముంబయి సెషన్స్‌ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.

Published : 25 May 2024 03:09 IST

ముంబయి: ఒకప్పటి బాలీవుడ్‌ నటి లైలా ఖాన్, ఆమె కుటుంబం 2011లో దారుణ హత్యకు గురైన కేసులో ముంబయి సెషన్స్‌ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇటీవల నిందితుడిగా గుర్తించిన లైలా సవతి తండ్రైన పర్వేజ్‌ తక్‌కు మరణశిక్షను విధించింది.  

ఏమిటీ కేసు..: 2011 జనవరి 30న లైలా తన తల్లి షెలీనా, నలుగురు సోదరీమణులతో కలిసి నాసిక్‌ జిల్లాలోని ఇగత్‌పురిలో గల తమ ఫామ్‌హౌస్‌కు వెళ్లి అక్కడ కన్పించకుండా పోయారు. దీంతో షెలీనా మొదటి భర్త, లైలా తండ్రి నాదీర్‌ షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. షెలీనా మూడో భర్త పర్వేజ్‌ తక్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ మరుసటి ఏడాది 2012 జూన్‌లో పర్వేజ్‌ తక్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆస్తి కోసం లైలా, ఆమె కుటుంబాన్ని తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. వెంటనే వారు ముంబయి పోలీసులకు సమాచారమివ్వగా ఈ సామూహిక హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని