ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎల్జీ జోక్యం తగదు

పుదుచ్చేరి ప్రభుత్వ రోజూవారీ కార్యకలాపాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) సీపీ రాధాకృష్ణన్‌ జోక్యం చేసుకుంటున్నారని, ఆయన వ్యవహార శైలి పాత ఎల్జీలు కిరణ్‌ బేడీ, తమిళిసైలను తలపిస్తోందని మాజీ సీఎం నారాయణసామి ఆరోపించారు.

Published : 27 May 2024 04:26 IST

పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణసామి

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి ప్రభుత్వ రోజూవారీ కార్యకలాపాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) సీపీ రాధాకృష్ణన్‌ జోక్యం చేసుకుంటున్నారని, ఆయన వ్యవహార శైలి పాత ఎల్జీలు కిరణ్‌ బేడీ, తమిళిసైలను తలపిస్తోందని మాజీ సీఎం నారాయణసామి ఆరోపించారు. పుదుచ్చేరిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా సమస్యలు, శాఖాపరమైన అంశాలను ఎన్నికైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమర్థంగా పనిచేసేలా ఎల్జీ చొరవ చూపాలి. కానీ ఆయనే స్వయంగా అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఉత్తర్వులు జారీచేయడం, ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం సరికాదు’ అని అన్నారు. ఇలాంటి వాటిని కేంద్ర పాలిత ప్రాంత చట్టం, ఇతర నిబంధనలు అనుమతించవని చెప్పారు. సీఎంకు, సంబంధిత మంత్రులకు.. ఎల్జీ హోదాలో లేఖలు రాసి పరిష్కార మార్గం చూపడంతో పాటు సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరితే సమంజసంగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని