ఆసుపత్రుల భద్రతపై తనిఖీలు చేపట్టండి

దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర సోమవారం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

Published : 28 May 2024 04:24 IST

అగ్నిప్రమాదాలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర సోమవారం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ‘వేసవి ఉష్ణోగ్రతలు అధికమైన పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో జరిగే అగ్ని ప్రమాదాల తీవ్రతా పెరుగుతోంది. అందువల్ల ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

ఈ చర్యలు తప్పనిసరి 

  • ఆసుపత్రుల్లోని అగ్నిమాపక ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలి. అవసరమైన చోట్ల ఫైర్‌ అలారమ్స్, పొగను గుర్తించి అప్రమత్తం చేసే యంత్రాలు, మంటలను ఆర్పివేసే పరికరాలు ఏర్పాటు చేయించాలి. విద్యుత్తు సరఫరా లోడ్‌లో లోటుపాట్లను సరిదిద్దాలి. 
  • ఆసుపత్రులన్నీ క్రమం తప్పకుండా అగ్నిమాపక దళం నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకొనేలా చూడాలి. పాత భవనాల్లో విద్యుత్తు లోడ్‌ సామర్థ్యాన్ని కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ప్రమాదం జరిగినప్పుడు రోగులను సురక్షితంగా తరలించేందుకు తగిన ప్రణాళికలు ముందుగా రూపొందించుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని