పాలస్తీనా ప్రజలకు బాలీవుడ్‌ నటీమణుల సంఘీభావం

పాలస్తీనా ప్రజలకు బాలీవుడ్‌ నటీమణులు ప్రియాంకా చోప్రా, అలియా భట్, కరీనాకపూర్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.

Published : 30 May 2024 05:13 IST

ముంబయి: పాలస్తీనా ప్రజలకు బాలీవుడ్‌ నటీమణులు ప్రియాంకా చోప్రా, అలియా భట్, కరీనాకపూర్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. గాజాలో చిన్నారులకు శాంతి, భద్రత కల్పించాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా భట్‌ పోస్టు చేశారు. తాత్కాలిక గుడారాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను హత్య చేయడం అనాలోచితమంటూ యునిసెఫ్‌ భారత  రాయబారిగా ఉన్న కరీనా కపూర్‌ తన పోస్టులో పేర్కొన్నారు. ‘అందరి కళ్లు రఫాపై’ చ్చిఃః’్వ’(్న-౯్చ÷్చ హ్యాష్‌ట్యాగ్‌తో సోనమ్‌ కపూర్, సమంత, కొంకణాసేన్‌ శర్మ, దియా మీర్జా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు.. ఇన్‌స్టాలో పలు చిత్రాలను పంచుకున్నారు. రఫాకు మద్దతుగా టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే చేసిన ఓ పోస్ట్‌ వివాదాస్పదమైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ అని రాసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. దీనిపై ‘ఎక్స్‌’ వేదికలో విమర్శలు వెల్లువెత్తాయి. కశ్మీరీ పండిట్లు, మణిపుర్‌లో హింస ఇలా దేశంలో నెలకొన్న సమస్యలపై ఏనాడైనా మాట్లాడారా? అంటూ పలువురు నెటిజన్లు రితికను ప్రశ్నించారు. కేవలం ట్రెండ్‌ను ఫాలో అవుతూ పోస్టులు చేయడం సరికాదని మరికొందరు విమర్శలు గుప్పించారు. దీంతో రితిక ఆ పోస్టును తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని