కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైల్లో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ అభ్యర్థనను బుధవారం నగర కోర్టు కొట్టివేసింది.

Published : 06 Jun 2024 05:27 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైల్లో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ అభ్యర్థనను బుధవారం నగర కోర్టు కొట్టివేసింది. ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 19 వరకు పొడిగించింది. దిల్లీ సీఎం ఆరోగ్య అవసరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు సూచించింది. సాధారణ బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 7న విచారించనుంది. దిల్లీ సీఎం ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స అవసరమని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది వాదనల సందర్భంగా పేర్కొన్నారు. దీన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వ్యతిరేకించింది. కేజ్రీవాల్‌ కోర్టును మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం తిహాడ్‌ జైలులో కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌.. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్ఢా కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు