జోషి, ఆడ్వాణీ ఆశీస్సులు తీసుకున్న మోదీ

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ శుక్రవారం భాజపా కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీని మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 08 Jun 2024 06:02 IST

దిల్లీ: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ శుక్రవారం భాజపా కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఆడ్వాణీ ఇంటికి వెళ్లిన ప్రధాని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. ఇరువురు నేతలూ వివిధ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి ఇంటికి మోదీ వెళ్లారు. ఆయన ఆశీర్వాదమూ తీసుకున్నారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని