విదేశీ అతిథులకు రాష్ట్రపతి విందు

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన ఇతర దేశాల అతిథులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు.

Published : 10 Jun 2024 05:16 IST

దిల్లీ: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన ఇతర దేశాల అతిథులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘె, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ ఆరిఫ్, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగన్నాథ్‌ దంపతులు, నేపాల్‌ ప్రధాని ప్రచండ, భూటాన్‌ ప్రధాని టొబాగే తదితరులు పాల్గొన్నారు. ఇరుగుపొరుగు దేశాధినేతల రాక తమ ప్రాథమ్యాలకు అద్దం పడుతోందనీ, ఇలాంటి సమావేశాలు పరస్పర అభివృద్ధికి దోహదం చేస్తాయని రాష్ట్రపతి అన్నారు. అనంతరం ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు