బంగ్లా ప్రధాని హసీనాతో సోనియా సమావేశం

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సోమవారం దిల్లీలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Published : 11 Jun 2024 04:57 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సోమవారం దిల్లీలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. భారత్‌-బంగ్లాదేశ్‌ల సహజ మైత్రీ బంధాన్ని మరింత దృఢపరుచుకోవడం, సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు వాట్సప్‌ ఛానెల్‌లో రాహుల్‌ గాంధీ పోస్ట్‌ చేశారు. హసీనాతో సమావేశమైన వీడియోను షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని