విద్యుత్తు సరఫరా ఆగినా రైలు ఆగదు

విద్యుత్తు సరఫరా ఆగినా రైలు ఆగకుండా ఉండేందుకు కోల్‌కతా మెట్రో రైలు దేశంలోనే ప్రప్రథమంగా కొత్త బ్యాటరీ వ్యవస్థను ఈ ఏడాది చివరికల్లా తీసుకురానుంది.

Published : 11 Jun 2024 05:29 IST

కొత్త సాంకేతికతను వినియోగించనున్న కోల్‌కతా మెట్రో

కోల్‌కతా: విద్యుత్తు సరఫరా ఆగినా రైలు ఆగకుండా ఉండేందుకు కోల్‌కతా మెట్రో రైలు దేశంలోనే ప్రప్రథమంగా కొత్త బ్యాటరీ వ్యవస్థను ఈ ఏడాది చివరికల్లా తీసుకురానుంది. ప్రయాణికులతో ప్రయాణిస్తున్న రైలు విద్యుత్తు సరఫరా ఆగిపోయి అకస్మాత్తుగా నిలిచిపోయినా ఈ బ్యాటరీ వ్యవస్థతో దాన్ని సురక్షితంగా సమీపంలో స్టేషన్‌కు తీసుకెళ్లొచ్చు. ప్రయాణికుల భద్రతను, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందని కోల్‌కతా మెట్రో రైలు ప్రతినిధి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని