Heavy Competition: ఉన్నది ఒక్క పోస్టు.. 10 వేల మందికిపైగా పోటీ

ఒక్క పోస్టు కోసం 10 వేల మందికిపైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారి కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Updated : 02 Oct 2022 09:15 IST

ఒక్క పోస్టు కోసం 10 వేల మందికిపైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారి కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేసే ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హమీర్‌పుర్‌ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంటు పోస్టును భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డిగ్రీ, కంప్యూటర్‌ డిప్లొమా విద్యార్హతలుగా ఉన్న ఈ పోస్టు కోసం ఇప్పటివరకూ 22,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఫీజు చెల్లించిన 10,386 మందికి హాల్‌ టికెట్లు జారీ చేశారు. ఈ నెల 9న నిర్వహించే పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 3 వరకూ గడువు ఉందని, ఆలోపు అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని