Ghulam Nabi Azad: రాహుల్ స్పూన్‌ ఫీడింగ్‌ కిడ్‌.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్‌

కాంగ్రెస్‌ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. 

Updated : 18 Apr 2024 11:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధైర్యంగా భాజపా (BJP)కు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న వ్యాఖ్యలను ఆ పార్టీ మాజీ నేత గులాం నబీఆజాద్ (Ghulam Nabi Azad) తోసిపుచ్చారు. ఆయన చర్యలు అలా అనిపించడం లేదని, భాజపా పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు సంకోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా మైనార్టీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని విమర్శించారు. సురక్షిత స్థానాలను ఎంచుకోవడాన్ని సైతం ప్రశ్నించారు.

రాహుల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్(NC) ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘స్పూన్‌ ఫీడింగ్ కిడ్స్’ అని ఎద్దేవా చేశారు. ‘‘వారిద్దరు వ్యక్తిగతంగా ఎలాంటి త్యాగాలు చేయలేదు. రాజకీయ వారసత్వాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సొంతంగా చేసిందేమీ లేదు’’ అని విమర్శించారు.

వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన గులాంనబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad).. రెండేళ్ల క్రితం దాన్నుంచి బయటకు వచ్చారు. ఆ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్‌ రాకతోనే కాంగ్రెస్‌ నాశనం మొదలైందంటూ నాడు మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వం కారణంగానే తాను వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని