Gautam adani: భారత్‌కు శాంతి విలువ తెలుసు: గౌతమ్ అదానీ

Eenadu icon
By National News Team Updated : 24 Jun 2025 13:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్: ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) సమయంలో మన సాయుధ దళాల పోరాటాన్ని  ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam adani) కీర్తించారు. మంగళవారం అదానీ గ్రూప్‌ 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన ఆపరేషన్‌ సిందూర్‌పై మాట్లాడారు. ఈసందర్భంగా భారత్‌కు శాంతి విలువ ఏంటో తెలుసని ఆయన పేర్కొన్నారు. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను మన దళాలు నేలమట్టం చేశాయి. దీనిపై అదానీ మాట్లాడుతూ.. ‘ భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాలు అత్యంత ధైర్యసాహసాలు కనబరిచాయి. పేరు, ప్రతిష్టలు, పతకాల కోసం కాకుండా విధి నిర్వహణలో భాగంగా పనిచేశారు. శాంతి ఉచితంగా రాదని, సంపాదించుకోవాలని వారి ధైర్యం మనకు గుర్తుచేసింది. శాంతి విలువ ఏంటో భారత్‌కు తెలుసు. అలా అని ఎవరైనా మనకు హాని కలిగించాలని చూస్తే.. వారి భాషలో ఎలా స్పందించాలో కూడా మనకు బాగా తెలుసు’ అని అదానీ పేర్కొన్నారు.

ఈసందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌లో అదానీ డిఫెన్స్ డ్రోన్లు కూడా భాగమయ్యాయని ఆయన తెలిపారు. అందులో తాము విజయం సాధించామన్నారు. తమ యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు మన దళాలను, పౌరులను రక్షించడంలో సహాయపడ్డాయని వెల్లడించారు. ఇక, ఈసందర్భంగా ఆయన ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి కూడా మాట్లాడారు. ఆ ఘటనలో మరణించిన వారికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. 

Tags :
Published : 24 Jun 2025 12:59 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు