PAN Aadhaar Link: ఆధార్‌- పాన్‌ లింక్‌.. ఫైన్‌తో కేంద్రానికి వచ్చిన ఆదాయం ఎంతంటే?

పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకోని వారికి విధించిన అపరాధ రుసుం ద్వారా సమకూరిన ఆదాయం వివరాలను కేంద్రం వెల్లడించింది.

Published : 05 Feb 2024 16:13 IST

దిల్లీ: నిర్ణీత గడువులోగా శాశ్వత సంఖ్య (PAN) పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం (PAN Aadhaar Link) చేసుకోని వారికి కేంద్రం ₹1,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫైన్‌ ద్వారా కేంద్రానికి ఇప్పటివరకు సమకూరిన ఆదాయం వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సోమవారం వెల్లడించింది. గతేడాది జులై 1 నుంచి, 2024 జనవరి 31 వరకు రూ.601.97 కోట్లు వసూలుచేసినట్లు తెలిపింది. ఆధార్‌- పాన్‌ అనుసంధానంపై లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మాలరాయ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  అలాగే, పాన్‌తో అనుసంధానం కాని ఆధార్‌ కార్డుల సంఖ్య 2024 జనవరి 29 నాటికి దేశవ్యాప్తంగా 11.48 కోట్లు (మినహాయింపు వర్గాలు కాకుండా)గా ఉన్నట్లు పేర్కొన్నారు.

పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే.. రూ.కోటి జరిమానా: లోక్‌సభలో బిల్లు

శాశ్వత ఖాతా సంఖ్య (PAN) ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం దానికి ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే. ఈ పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు గతేడాది జూన్‌ 30తో ముగిసింది. 2023 జులై 1 ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ ఖాతాలు పనిచేయవని ఆదాయపు పన్నుశాఖ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.  వాస్తవానికి అనుసంధానానికి గడువు ఎప్పుడో ముగిసినా రూ.1000 అపరాధ రుసుముతో అదనపు గడువు కల్పించింది. రూ.1000 ఫైన్‌ చెల్లించి ఆధార్‌ అధికారులకు ఆ విషయం వెల్లడిస్తే 30 రోజుల తర్వాత పాన్‌ కార్డును పునరుద్ధరించుకోవచ్చని గతంలో సీబీడీటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంకా దాదాపు 11 కోట్ల మందికి పైగా లింక్‌ చేయాల్సి ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని