Armed Forces: సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచుతాం : మోదీ

సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Published : 04 Dec 2023 20:48 IST

ముంబయి: సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు భారత్‌ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటోందన్న ఆయన.. వాటిని సాధించేందుకు వనరులన్నింటినీ సమర్థమంతంగా వాడుకుంటోందన్నారు. నౌకాదళ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!

‘సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడంపై దృష్టి సారిస్తున్నాం. భారత సంస్కృతికి అనుగుణంగా నౌకాదళంలో ర్యాంకుల పేర్లు మార్చుతున్నాం. నేడు భారత్‌ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. వాటిని సాధించేందుకు ఉన్న అన్ని వనరులను సమర్థమంతంగా వినియోగించుకుంటోంది. ఎన్నో ఘన విజయాల చరిత్ర మనది. యావత్‌ ప్రపంచం నేడు భారత్‌ను విశ్వమిత్రగా చూస్తోంది’ అని అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి భారత్‌ భారీ మద్దతు ఇస్తోందన్న ఆయన.. మర్చెంట్‌ షిప్పింగ్‌ను కూడా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో మహాసముద్రాల వనరులను విరివిగా వాడుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముందు రాజ్‌కోట్‌ కోటలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.

2024 విజయానికి సంకేతం : రాజ్‌నాథ్‌

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడు చోట్ల భాజపా విజయం సాధించడం అద్భుతమైన విషయమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో భాజపా కేంద్రంలో అధికారంలో కొనసాగుతుందనడానికి ఇదో సంకేతమన్నారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో దేశం ఉన్నట్లు కనిపిస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని