CSAM: ఆ కంటెంట్‌ను తక్షణమే తొలగించండి.. ఎక్స్‌, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు కేంద్రం హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంటును (CSAM) తక్షణమే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్‌), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.

Published : 07 Oct 2023 01:59 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను (CSAM) కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వీటిని తక్షణమే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్‌), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీచేసింది. లేదంటే సురక్షిత ఆశ్రయం (safe harbour) హోదాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ (చైల్డ్‌ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్)ను ఆయా వేదికల నుంచి తొలగించాలని హెచ్చరిస్తూ సామాజిక మాధ్యమ సంస్థలైన ఎక్స్‌ (ట్విటర్), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. శాశ్వతంగా తొలగించడం లేదా అటువంటి కంటెంట్‌ను యాక్సెస్‌ చేయనీయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అందులో పేర్కొంది. వీటితోపాటు భవిష్యత్తులో ఇటువంటి కంటెంట్‌ను నిరోధించడానికి పర్యవేక్షణ, నియంత్రణ, రిపోర్టింగ్‌ అల్గారిథంలలో మార్పులు చేసుకొని, అమలు చేయాలని తాజా నోటీసుల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Police Station: లాకప్‌లో అరగంట అక్రమ నిర్బంధం.. పోలీసులకు రూ.50వేల ఫైన్‌!

ఆన్‌లైన్‌లో చిన్నారుల వేధింపుల కంటెంటుపై సామాజిక మాధ్యమ సంస్థలు ఒకవేళ తక్షణమే స్పందించకుంటే ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 కల్పిస్తోన్న సురక్షిత ఆశ్రయం (safe harbour) హోదాను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. దీని ప్రకారం కంటెంటును ఆయా సంస్థలు నేరుగా అప్‌లోడ్‌ చేయకున్నా.. చట్టపరంగా వాటిని విచారించే వీలుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని