IIT Bombay: ఐఐటీ బాంబేలో ‘పాలస్తీనా’ కలకలం.. ప్రొఫెసర్‌, బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌పై ఫిర్యాదు

IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్థులకు గెస్ట్‌ లెక్చర్‌ ఇచ్చిన ఓ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌.. పాలస్తీనా ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 10 Nov 2023 17:45 IST

ముంబయి: మహారాష్ట్రలోని ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబే (IIT Bombay)లో ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చిన ఓ అతిథి పాలస్తీనా ఉగ్రవాదులకు మద్దతుగా వ్యాఖ్యాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆయన ప్రసంగంతో విస్తుపోయిన విద్యార్థులు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబరు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఐఐటీ బాంబేలోని హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌  విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ శర్మిష్ఠ సాహా.. ఇటీవల అకాడమీ కోర్సులో భాగంగా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ సుధన్వ దేశ్‌పాండే (Sudhanva Deshpande)ను గెస్ట్‌ లెక్చర్‌ ఇచ్చేందుకు ఆహ్వానించారు. నవంబరు 6న వర్చువల్‌గా జరిగిన ఈ లెక్చర్‌లో సుధన్వ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, పాలస్తీనీయుల గురించి ప్రస్తావించారు. సాయుధ తిరుగుబాటుకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు విద్యార్థులు ప్రొఫెసర్‌ సాహా, సుధన్వపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భీకరంగా భూతల పోరు.. హమాస్‌ కీలక కమాండర్లు హతం..!

‘‘పాలస్తీనా ఉగ్రవాదులు జకరియా జుబేది, ఘసన్‌ కనాఫనిని పొగుడుతూ సుధన్వ వ్యాఖ్యలు చేశారు. అల్‌ అక్సా బ్రిగేడ్‌తో జుబేది అత్యంత సన్నిహితంగా వ్యవహరించాడు. అల్‌ అక్సాను.. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌ సహా పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థ ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఇక, హింస, సాయుధ తిరుగుబాటును ఆయన సమర్థించారు. ఇలాంటి ప్రసంగాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఉగ్రవాద భావజాలంవైపు మొగ్గుచూపేలా ప్రేరేపిస్తాయి’’ అని ఐఐటీ బాంబే విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి ప్రొఫెసర్‌, గెస్ట్‌ లెక్చర్‌పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

కాగా.. సుధన్వ ప్రసంగం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో దీనిపై ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్ కోబి షోషానీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ఐఐటీ బాంబేలో ఉగ్రవాదులకు మద్దతిస్తూ ప్రసంగించడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, విద్యార్థులు, యాజమాన్యం దీన్ని వెంటనే గుర్తించి వారిపై చర్యలు చేపట్టడం సంతోషకరం’’ అని రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు