వరద ఉద్ధృతిలో చిక్కుకున్న ప్రయాణికుల బస్సు.. దృశ్యాలు వైరల్‌

Bus stuck in Flood water: భారీ వర్షాలకు నది ఉప్పొంగడంతో ఓ ప్రయాణికుల బస్సు అందులో చిక్కుకుపోయింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి అందులోని ప్రయాణికులను కాపాడగలిగారు. 

Published : 22 Jul 2023 17:41 IST

బిజ్నోర్‌: భారీ వర్షాల (Heavy Rains)తో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగి వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కొత్వాలీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో యూపీ-ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోని ఓ రోడ్డుపైకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. (Bus stuck in Flood water)

యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు రూపెదిహా నుంచి హరిద్వార్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బస్సు ముందుకెళ్లలేకపోయింది. తమను కాపాడాలంటూ ప్రయాణికులు హహకారాలు చేశారు. బస్సును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

ముంబయిని ముంచెత్తిన వానలు.. రాయ్‌గఢ్‌లో ఇంకా దొరకని 83 మంది ఆచూకీ

అక్కడకు చేరుకున్న పోలీసులు జేసీబీ మిషన్ల సాయంతో ప్రయాణికులను రక్షించారు. ఆ తర్వాత బస్సును కూడా వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని