Himanta Biswa Sarma: ‘రాహుల్‌, ప్రియాంక అమూల్‌ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Updated : 17 Apr 2024 14:01 IST

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) మరోసారి వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. వారిద్దరూ ‘అమూల్‌ బేబీలు’ అని అభివర్ణించారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల అస్సాంలో ప్రియాంక గాంధీ చేపట్టిన రోడ్‌ షోపై హిమంత స్పందించారు. ‘‘గాంధీ కుటుంబంలోని అమూల్‌ బేబీలను చూసేందుకు రాష్ట్ర ప్రజలు ఎందుకు వెళతారు? వారి ఎన్నికల ప్రచారానికి బదులు కజిరంగా నేషనల్‌ పార్క్‌కు వెళ్లడం మేలనుకుంటారు’’ అని అన్నారు.

అమేఠీ నుంచి పోటీపై రాహుల్‌ గాంధీ ఏం చెప్పారంటే..?

తనకు తెలిసినంత వరకు కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌తో కలిసి ప్రియాంక చేపట్టిన రోడ్‌ షోకు 2 నుంచి 3 వేల మంది మాత్రమే హాజరయ్యారని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబాన్ని చూడటం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే ఆ రోడ్‌ షోలో జనం లేరని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని