Rahul Gandhi: అమేఠీ నుంచి పోటీపై రాహుల్‌ గాంధీ ఏం చెప్పారంటే..?

అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. 

Updated : 17 Apr 2024 13:09 IST

లఖ్‌నవూ: ఐదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీ (Amethi) నియోజకవర్గం నుంచి ఈసారి అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీ పడుతున్నారా..? లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. తాజాగా మీడియా నుంచి రాహుల్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.

‘‘వెరీ గుడ్‌..ఇది భాజపా ప్రశ్న. పార్టీకి చెందిన సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ (CEC), కాంగ్రెస్ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా నేను వ్యవహరిస్తాను. ఆ నిర్ణయాలు సీఈసీలో తీసుకుంటారు’’ అని రాహుల్ వెల్లడించారు. ఆ స్థానానికి ఆయన వరుసగా 15 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు.

హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సుర్జేవాలాపై ఈసీ చర్యలు

ఇదిలా ఉంటే.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి నేడు రాహుల్ మీడియాతో ముచ్చటించారు. ‘‘15-20రోజుల క్రితం భాజపా 180 సీట్లు గెలుస్తుందని నేను అనుకున్నాను. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే.. 150 రావొచ్చని భావిస్తున్నాను. మాకు ఆదరణ పెరుగుతోందని అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు వస్తున్నాయి. ఇక్కడ గట్టి మిత్రపక్షం ఉంది’’ అని అన్నారు. అలాగే ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద దోపిడీ పథకమని విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని