Supreme Court: నేను రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ఓ న్యాయమూర్తిగా.. చట్టం, రాజ్యాంగానికి తానో సేవకుడినని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (CJI D Y Chandrachud) పేర్కొన్నారు.

Updated : 08 Dec 2023 15:27 IST

దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (CJI D Y Chandrachud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ న్యాయమూర్తిగా.. చట్టం, రాజ్యాంగానికి తానో సేవకుడినని అన్నారు. నిర్దేశించిన స్థాయిని అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. కొలీజియం వ్యవస్థలో (Collegium system) సంస్కరణలు అవసరమనే అంశాన్ని ధర్మాసనం దృష్టికి ఓ న్యాయవాది తీసుకువచ్చిన నేపథ్యంలో సీజేఐ ఇలా మాట్లాడారు.

సుప్రీంకోర్టులో (Supreme Court) శుక్రవారం రోజువారీ కార్యకలాపాలు ప్రారంభం కాగానే సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సమావేశమైంది. ఇదే సమయంలో మాథ్యూస్‌ జే నెడుంపారా అనే న్యాయవాది కోర్టు ముందు ఓ అంశాన్ని ప్రస్తావించారు. కొలీజియం వ్యవస్థలో సంస్కరణల అవసరంతోపాటు సీనియర్‌ న్యాయవాది హోదా రద్దు వంటి అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ..

విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం: మద్యం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

‘మీ మనసుకు నచ్చిన అంశాన్ని చెప్పే స్వేచ్ఛ మీకు ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా, ముఖ్యంగా ఓ న్యాయమూర్తిగా.. మొదట నేను చట్టం, రాజ్యాంగానికి సేవకుడిని. నిర్దేశించిన స్థాయిని అనుసరించాల్సి ఉంటుంది. నాకు ఇది నచ్చింది, నేను ఇది చేస్తా అని చెప్పలేను’ అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, న్యాయవాదుల్లో కొందరికి సీనియర్‌ న్యాయవాది హోదా ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ నెడుంపారా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది అక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అడ్వొకేట్స్‌ చట్టం-1961లోని నిబంధనల ప్రకారం సీనియర్‌ న్యాయవాది హోదాకు రాజ్యాంగబద్ధత ఉందని తెలిపింది. సీనియర్‌ న్యాయవాది హోదాను ఇచ్చే యంత్రాంగం ఏకపక్షంగా కృత్రిమంగా లేదని, ప్రతిభ ఆధారిత ప్రక్రియ అని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు