Online Betting: ఆన్లైన్ బెట్టింగ్‌పై కేంద్రం సీరియస్‌.. ప్రకటనలు చేయొద్దంటూ సూచన

ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్లాట్​ఫామ్స్‌కు సంబంధించి ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​ మీడియాలకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది........

Published : 13 Jun 2022 21:18 IST

దిల్లీ: ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్లాట్​ఫామ్స్‌కు సంబంధించి ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​ మీడియాలకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆన్​లైన్​ బెట్టింగులు, గ్యాంబ్లింగ్ లాంటి కార్యకలాపాలు​ చట్టవిరుద్ధమని వెల్లడించింది. వినియోగదారులకు ఇలాంటివి ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల ప్రింట్​, ఎలక్ట్రానిక్​, సోషల్​​, ఆన్​లైన్​ మీడియాల్లో ఆన్​లైన్​ బెట్టింగ్​ వెబ్​సైట్లు​ ప్రకటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేసినట్లు పేర్కొంది.

‘దేశంలోని చాలా ప్రాంతాలలో బెట్టింగ్‌, జూదం  చట్టవిరుద్ధం. ఇవి వినియోగదారులకు, ముఖ్యంగా యువత, పిల్లలకు గణనీయమైన ఆర్థిక, సామాజిక  ప్రమాదాన్ని కలుగజేస్తాయి. అందుకే ఆన్​లైన్​ బెట్టింగ్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రచురించవద్దు. ఆయా ప్రకటనల ద్వారా చట్టవిరుద్ధమైన ఈ చర్యను ప్రోత్సహించినట్లవుతుంది. ఆన్​లైన్​ అడ్వెర్టయిజ్‌​మెంట్​ పబ్లిషర్లు​, మధ్యవర్తులు​ సహా ఆన్​లైన్​, సోషల్​ మీడియాలు సైతం బెట్టింగ్‌ ప్రకటనలకు దూరంగా ఉండాలి’అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు