AAP: దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్‌

దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది ‘రాజకీయ ప్రతీకారమే’ అని స్పష్టంగా అర్థమవుతుందని ఆమ్‌ఆద్మీ పార్టీ పేర్కొంది.

Published : 27 Mar 2024 20:38 IST

దిల్లీ: దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన (President Rule in Delhi) విధిస్తే అది ‘రాజకీయ ప్రతీకారమే’ అని స్పష్టంగా అర్థమవుతుందని ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) పేర్కొంది. జైలు నుంచే ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పాలన కొనసాగిస్తారని ఆప్‌ నేతలు చేస్తున్న ప్రకటనలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందిస్తూ.. దిల్లీ పాలన అలా నడవదన్నారు. ఎల్‌జీ చేసిన ఈ ప్రకటనపై దిల్లీ మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎవరైనా చట్టసభ సభ్యుడు /సభ్యురాలు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.

‘వారు (లెఫ్టినెంట్‌ గవర్నర్‌) చెబుతున్న రాజ్యాంగ నిబంధన ఏమిటీ? వీటికి సంబంధించి చట్టంలో స్పష్టంగా ఉంది. అటువంటప్పుడు ఏ పరిస్థితుల్లో దిల్లీలో (Delhi) రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆర్టికల్‌ 356 అంశం అనేకసార్లు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది’ అని దిల్లీ మంత్రి అతిశీ ప్రశ్నించారు. పాలనకు ఏవిధమైన అవకాశాలు లేనప్పుడు మాత్రమే ప్రెసిడెంట్‌ రూల్‌ విధించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఒకవేళ ఇప్పుడు అలా చేస్తే.. అది రాజకీయ ప్రతీకారమేనని తేలిపోతుందన్నారు. మరో కోణంలో చూస్తే.. విపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇదో ఫార్ములా అని భావించాలన్నారు.

ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్‌ సిబ్బంది రెడీ!

‘ఈడీ మీ చేతిలో ఉంది. వారికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. పీఎంఎల్‌ఏ కింద అరెస్టు అయ్యే నేతలు బెయిల్‌ పొందలేరు. దీనికింద అందరు విపక్ష సీఎంలు అరెస్టవుతారు. అప్పుడు రాజీనామా చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం. ఇదే వారి ఫార్ములా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ దిల్లీ మంత్రి అతిశీ ఆరోపణలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని