MEA: కెనడాలో ఖలిస్థానీ కార్యకలాపాలు.. అమెరికాకు మా ఆందోళన తెలియజేశాం

కెనడాలో ఖలీస్థాన్‌ వేర్పాటువాద కార్యకలాపాలు పెరగడంపై భారత్‌ ఆందోళనను అమెరికాకు స్పష్టంగా వివరించినట్లు భాతర విదేశాంగ శాఖ తెలిపింది. 

Published : 10 Nov 2023 21:25 IST

దిల్లీ: భారత్‌ - కెనడాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి భారత్‌-అమెరికా (India-USA) 2+2 మంత్రుల స్థాయి సమావేశంలో చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. శుక్రవారం భారత్‌ - అమెరికా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల మధ్య జరిగిన భేటీ అనంతరం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కెనడాలో ఖలీస్థాన్‌ వేర్పాటువాద కార్యకలాపాలు పెరగడంపై భారత్‌ ఆందోళనను అమెరికాకు స్పష్టంగా తెలిపినట్లు చెప్పారు.  

‘‘కెనడాతో నెలకొన్న పరిస్థితుల గురించి మా మిత్ర దేశాలతో తరచుగా మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పటికే పలు సందర్భరాల్లో వారికి పరిస్థితిని వివరించాం. ప్రధానంగా భద్రతకు సంబంధించి మా ఆందోళనను అమెరికాకు తెలిపాం. ఇటీవల గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరిక వీడియో గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దానిపై మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. వారు మా ఆందోళనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని క్వాత్రా తెలిపారు. 

ఐఐటీ బాంబేలో ‘పాలస్తీనా’ కలకలం.. ప్రొఫెసర్‌, బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌పై ఫిర్యాదు

గత నెలలో ఖలిస్థాన్‌ వేర్పాటువాది, ‘సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ ఎయిరిండియా ప్రయాణికులను హెచ్చరిస్తూ.. వీడియో విడుదల చేశాడు. నవంబరు 19న ఎయిరిండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని అన్నాడు. భారత్‌లోని సిక్కులెవరూ ఆ రోజున ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని హెచ్చరించాడు. ఈ వీడియో తీవ్ర దుమారం రేపడంతో కెనడా-భారత్‌ మధ్య నడిచే విమానాలకు అదనపు భద్రత కల్పించాలని కెనడాను భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలో సదరు వీడియోపై విచారణ జరుపుతున్నామని కెనడా ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు