Kejriwal Arrest: కేజ్రీవాల్‌ అరెస్టు.. సీఈసీని కలవనున్న ‘ఇండియా’ కూటమి నేతలు

Kejriwal Arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో విపక్ష కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలవనున్నారు. అటు కేజ్రీవాల్‌ రిమాండ్‌పై కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.

Published : 22 Mar 2024 18:30 IST

దిల్లీ: మద్యం విధానానికి (Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. ఈ అరెస్టును విపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే వీరు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం లేదా శనివారం వారు సీఈసీతో సమావేశం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌, టీఎంసీ, సీపీఎం, డీఎంకే, ఎన్‌సీపీ, ఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతినిధులు ఈ భేటీలో పాల్గోనున్నారు.

మద్యం కేసులో ‘కింగ్‌పిన్‌’ ఆయనే.. కోర్టుకు వెల్లడించిన ఈడీ

కేజ్రీవాల్‌ రిమాండ్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు నేడు రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఆయనను 10 రోజుల పాటు కస్టోడియల్‌ రిమాండ్‌కు అప్పగించాలని దర్యాప్తు సంస్థ కోరింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ ప్రధాన సూత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. మద్యం విధానంతో వచ్చిన లాభాలను ఆమ్‌ఆద్మీ పార్టీ నిధుల కింద ఉపయోగించుకున్నట్లు ఆరోపించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సీఎం రిమాండ్‌పై మరికాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని