Sharad Pawar: ఎవ్వరితో టచ్‌లో లేను : శరద్‌ పవార్‌

విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని.. భవిష్యత్తు కార్యాచరణపై బుధవారం చర్చిస్తామని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Updated : 04 Jun 2024 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రంలో విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. బుధవారం దిల్లీలో సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామన్నారు. ఈ క్రమంలో ఎన్‌డీఏలో ఉన్న నీతీశ్‌ వంటి కీలక నేతలతో టచ్‌లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను తోసిపుచ్చిన ఆయన.. తాను ఇంకా ఎవరితోనూ మాట్లాడలేదన్నారు.

‘‘మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరితో మాట్లాడా. రేపు (బుధవారం) దిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నాం’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. తదుపరి ప్రధానమంత్రి ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనుకోవడం లేదు. రేపు భేటీ అయి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చిన ఫలితాలు విపక్ష కూటమికి కొత్త మార్గనిర్దేశం చేశాయని పవార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో భాజపా పలు స్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. అనేక చోట్ల గతంతో పోలిస్తే మెజార్టీ మాత్రం అతి తక్కువగా వచ్చిందన్నారు. ఇక మహారాష్ట్రలో తమ పార్టీ పది చోట్ల పోటీ చేయగా.. ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని