Canada Plane: కెనడా ప్రధానికి.. ‘ఎయిర్‌ ఇండియా వన్‌’ ఆఫర్‌ చేసినా..!

కెనడా ప్రధాని తిరుగు ప్రయాణానికిగానూ భారత్ తన ‘ఎయిర్‌ ఇండియా వన్‌’ విమానాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆఫర్‌ చేసిందట. విమానంలో సాంకేతిక సమస్యలతో కెనడా ప్రధాని భారత్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Published : 12 Sep 2023 21:54 IST

దిల్లీ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau).. తన విమానంలో సాంకేతిక సమస్యతో ఇక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆ సాంకేతిక లోపాన్ని పరిష్కరించడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన తిరిగి కెనడాకు పయనమయ్యారు. అయితే.. ట్రూడో, ఆ దేశ ప్రతినిధుల తిరుగు ప్రయాణానికి వీలుగా సోమవారమే భారత్ తన అధికారిక ‘ఎయిర్‌ ఇండియా వన్‌ (Air India One)’ విమానాన్ని వినియోగించుకోవాలని సూచించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కానీ, కెనడా మాత్రం తమ మరో విమానం వచ్చే వరకు వేచి చూసేందుకే మొగ్గుచూపిందట.

కెనడా ప్రధాని ట్రూడోకు వరుస షాక్‌లు..!

వాస్తవానికి ఆదివారం సాయంత్రమే జస్టిన్‌ ట్రూడో భారత్‌ను వీడాల్సింది. కానీ, విమానంలో సాంకేతిక సమస్యతో ఇక్కడే ఆగిపోయారు. దీంతో ట్రూడో కోసం మరో విమానాన్ని కెనడా ఎయిర్‌ఫోర్స్‌ పంపింది. ఇటలీ మీదుగా అది భారత్‌కు వస్తోన్న తరుణంలో.. ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. దీంతో రెండో విమానాన్ని లండన్‌ వైపు మళ్లించారు. ఇదిలా ఉండగా.. జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడో పర్యటన సాంతం అసౌకర్యంగానే కనిపించారు. సదస్సు తొలిరోజు నిర్వహించిన విందుకు కూడా హాజరు కాలేదు. ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని