Jaishankar: సంక్షోభంలో ప్రపంచం.. భారత్‌కు బలమైన నేత అవసరం: జైశంకర్‌

అనేక సంఘర్షణలతో ప్రపంచం ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉందని, ఈనేపథ్యంలో భారత్‌కు శక్తిమంతమైన నేత అవసరమని జైశంకర్‌ పేర్కొన్నారు.

Published : 28 May 2024 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనేక సంఘర్షణల కారణంగా ప్రపంచం ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుందని భారత విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) తెలిపారు. ఈ వివాదాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదని చెప్పారు. ఇటువంటి విపత్కర సమయంలో భారత్‌కు బలమైన నాయకత్వం ఉందనే సందేశాన్ని ప్రపంచ వేదికపై చాటాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్న వేళ.. ఓటర్లు తెలివిగా ఓటు వేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

‘‘ఒకవైపు ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌- గాజా- ఇరాన్‌ల మధ్య పోరుతో పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొంది. ఇటువంటి సంఘర్షణలతో ప్రపంచం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. ఈ విభేదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. మన దేశ సరిహద్దుల్లోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం అవసరం. శక్తిమంతమైన నాయకుడు కావాలి’’ అని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి జైశంకర్‌ మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.

గోరఖ్‌పుర్‌లో భోజ్‌పురి యాక్షన్‌ చిత్రం.. యోగి అడ్డాలో హోరాహోరీ..!

‘‘మరో నాలుగైదేళ్లు కష్టకాలం ఉండనుంది. మన సరిహద్దుల్లోనూ అటువంటి సంఘర్షణలకు అవకాశం లేకపోలేదు. 1962లో చైనా మననుంచి ఆక్రమించిన భూభాగంలో రోడ్లు, వంతెనలు, నివాస ప్రాంతాలను నిర్మిస్తోంది. పాకిస్థాన్‌ సమన్వయంతో సియాచిన్‌కు రోడ్డు నిర్మించింది. భారత్‌ కూడా అక్కడ బలగాలను మోహరించింది. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చింది. భారత్‌-చైనా సరిహద్దు భద్రత విషయంలో భారత్‌ తన బడ్జెట్‌ను రూ.3 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లకు పెంచింది’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని